మా అమ్మానాన్నలకే అభ్యంతరం లేనప్పుడు... వీరికెందుకు?: రకుల్ ప్రీత్ సింగ్
- మ్యాగ్జిమ్ కవర్ పేజ్ కోసం రకుల్ ఫొటో షూట్
- విమర్శలు గుప్పించిన అభిమానులు
- పట్టించుకోబోనన్న రకుల్
ఈ అంశంపై ఇండియాటుడేకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో రకుల్ స్పందించింది. తన ఫొటో షూట్ పై కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు సానుకూలంగా స్పందించారని చెప్పింది. పాజిటివ్ కామెంట్లకు పొంగిపోవడం, నెగెటివ్ కామెంట్లకు కుంగిపోవడం తన నైజం కాదని తెలిపింది. తన కెరీర్ లో ప్రముఖ మేగజీన్ కవర్ పై ఒక్కసారైనా మెరవాలని ప్రతి హీరోయిన్ అనుకుంటుందని... తనకు ఆ అవకాశం వచ్చిందని, వచ్చిన అవకాశాన్ని వాడుకున్నానని చెప్పింది.
తాను చేసిన పని తనకు నచ్చిందని తెలిపింది. ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని చెప్పింది. తన అమ్మానాన్నలకే లేని అభ్యంతరం... వీరికెందుకని ఎదురు ప్రశ్నించింది. కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను తాను ఎన్నడూ ఎదుర్కోలేదని తెలిపింది. తెలుగులో సరైన కథ దొరకకపోవడం వల్లే తాను ఏ కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదని పేర్కొంది.