హైదరాబాద్ లో బాలీవుడ్ హీరో' ఇమ్రాన్ హష్మీ.. అభిమానులు చుట్టుముట్టడంతో కారు దిగకుండానే వెళ్లిపోయిన వైనం!

ప్రముఖ బాలీవుడ్ నటుడు, 'లిప్ కిస్ హీరో'గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ, హైదరాబాద్ టోలీచౌకీలోని ఓ మాల్ లో జరిగే కార్యక్రమంకి రాగా చేదు అనుభవం ఎదురైంది. మాల్ లోని ఓ షోరూంను ప్రారంభించేందుకు ఇమ్రాన్ హష్మితో పాటు బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్,  బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని ఆహ్వానించారు.

గత రాత్రి 8.30 గంటల సమయంలో కారులో మాల్ ఆవరణకు ఇమ్రాన్ రాగా, అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో చేరిన అభిమానులు ఆయన్ను దగ్గరి నుంచి చూసేందుకు పోటీ పడ్డారు. ఆయనతో సెల్ఫీ దిగాలని, కరచాలనం చేయాలని భావిస్తూ కారు చుట్టూ ఎగబడ్డారు. వారిని నియంత్రించడం బౌన్సర్ల వల్ల కాలేదు. ఆపై మాల్ లోకి వచ్చేందుకు నిరాకరించిన ఇమ్రాన్ స్టోర్ ఇనాగరేషన్ లో పాల్గొనకుండానే వెనుదిరిగి పోయారు. ఆయన కారును అతికష్టం మీద మాల్ ను దాటించగలిగారు బౌన్సర్లు.
Go Back to Shorts
Hyderabad
Imran Hashmi
Mall
Fans

More Telugu News