మేడారం తల్లులకు భక్తుల కానుకలు... ఆల్ టైం రికార్డుకు హుండీ ఆదాయం
- మేడారంలో ఏర్పాటైన 200కు పైగా హుండీలు
- జాతర అనంతరం లెక్కించిన అధికారులు
- ఈ ఏటి ఆదాయం రూ. 4.87 కోట్లు
జాతర అనంతరం హుండీలకు వేసిన సీళ్లను తెరిపించి వచ్చిన కానుకలను లెక్కించారు. హుండీల ద్వారా మొత్తం రూ. 4.87 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు. ఇది మేడారం జాతర చరిత్రలో సరికొత్త రికార్డని, గత సంవత్సరంతో పోలిస్తే హుండీ ఆదాయం పెరిగిందని అన్నారు.