సిరియన్ ఉగ్రవాదుల దారుణం.. రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసి, పైలట్ ను కాల్చి చంపారు!
- సిరియా ఉత్తర ఇడ్లిబ్ ఫ్రావిన్స్ లో సంఘటన
- షోల్డర్-ఫైర్డ్ మిసైల్ తో కూల్చివేత
- ప్యారాచూట్ సాయంతో కిందకు దిగిన పైలట్ ను కాల్చివేసిన హెచ్ టీఎస్ ఉగ్రవాదులు
ప్యారాచూట్ సాయంతో కిందకు దిగిన అందులోని పైలట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. కాగా, ఈ ఘటనను రష్యా రక్షణ శాఖ ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన చేసింది. తమ యుద్ధవిమానాన్ని సిరియన్ తిరుగుబాటుదారులు నేలకూల్చారని పేర్కొంది. పోర్టబుల్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ తో విమానాన్ని కూల్చినట్టు తెలుస్తోందని రష్యా ఏజెన్సీలు పేర్కొన్నాయి. ఈ యుద్ధవిమానాన్ని కూల్చి వేసింది తామే నంటూ హెచ్ టీఎస్ పేర్కొంది. ఇడ్లిబ్ ప్రాంతంలో రష్యా దాడులకు వ్యతిరేకంగానే ఈ విమానాన్ని కూల్చివేసినట్టు తెలిపింది.