ఎన్నికల సమయంలో కూటమి ప్రయత్నం సహజమే: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
Add ap7am to your home Screen

ఎన్నికల సమయంలో కూటమి ప్రయత్నం సహజమే: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

  • కూటమి గురించి స్పష్టత వచ్చాక చెబుతాం
  • ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్ధమే
  • ప్రజల మ‌ద్ద‌తు మా వైపే ఉంది
ఎన్నికలు స‌మీపిస్తోన్న నేప‌థ్యంలో కూటమి ప్రయత్నం సహజమేన‌ని, త‌మ పార్టీ ఆ ప్రయత్నం చేస్తోందని, అయితే దీనిపై స్ప‌ష్ట‌త వ‌చ్చాక మీడియాకు చెబుతామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ముందస్తు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామని తేల్చి చెప్పారు. మహాభారతంలో ఎక్కువ బ‌లం కౌర‌వులకే ఉన్న‌ప్ప‌టికీ పాండవులే గెలిచారని ఆయ‌న అన్నారు. అలాగే, ప్రజల మ‌ద్ద‌తు త‌మవైపే ఉందని తాము న‌మ్ముతున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలో రైతుల స‌మ‌స్య‌లు పరిష్కారం కావ‌డం లేద‌ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. రైతుల‌ను ఆదుకోవాల‌ని సూచించారు.
Uttam Kumar Reddy
Congress
TRS

More Telugu News