కొత్త లుక్ తో విజయ్ అదరగొట్టేస్తాడట!
Add ap7am to your home Screen

కొత్త లుక్ తో విజయ్ అదరగొట్టేస్తాడట!

  • 62వ సినిమా పనుల్లో బిజీగా విజయ్ 
  • కథానాయికగా కీర్తి సురేశ్ 
  • బలమైన సందేశంతో కూడిన కథ 
'మెర్సల్' హిట్ తరువాత విజయ్ మరింత ఉత్సాహంతో వున్నాడు. ఈ జోష్ తోనే ఆయన మురుగదాస్ దర్శకత్వంలో తన తాజా చిత్రాన్ని మొదలుపెట్టేశాడు. ఇది విజయ్ కి 62వ సినిమా .. ఇందులో ఆయన లైట్ గెడ్డంతో .. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కొత్త లుక్ తో కనిపిస్తాడని టాక్. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఫొటో షూట్ ను కూడా పూర్తి చేశారు.

కొంత కాలంగా సినిమా .. సినిమాకి తాను కొత్తగా కనిపించడానికి విజయ్ ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. మాస్ .. క్లాస్ ఆడియన్స్ ను అలరించే అంశాలతో పాటు, స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి 'భైరవ' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ విజయ్ రాజకీయాలను టచ్ చేస్తారా .. లేదా? అనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.  
vijay
keerthi suresh

More Telugu News