క్రికెట్ అప్ డేట్స్: నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా!

  • జోహన్స్‌బర్గ్‌లో ద‌క్షిణాఫ్రికాతో చివరి టెస్టు
  • రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ప్రస్తుత స్కోరు 134/4 (49ఓవర్లకి) 
  • క్రీజులో విరాట్ కోహ్లీ (41), అజింక్యా రహానె (19)
జోహన్స్‌బర్గ్‌లో ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతోన్న చివ‌రి టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయింది. మురళీ విజ‌య్ 25, పార్థివ్ పటేల్ 16, లోకేశ్ రాహుల్ 16, చటేశ్వర్ పుజారా 1 పరుగు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 41, అజింక్యా రహానె 19 పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలండెర్ రెండు వికెట్లు తీయగా, రబాడా, మార్కెల్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 134/4 (49 ఓవర్లకి) గా ఉంది. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 187 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 194 పరుగులు చేసిన విషయం తెలిసిందే.  
Go Back to Shorts
Cricket
India
south africa

More Telugu News