'హలో' సినిమాలో నా ఫోన్ నెంబర్ వాడారు.. నాగార్జున నష్టపరిహారం ఇవ్వాలి!: జార్ఖండ్ వాసి డిమాండ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'హలో' సినిమాలో నా ఫోన్ నెంబర్ వాడారు.. నాగార్జున నష్టపరిహారం ఇవ్వాలి!: జార్ఖండ్ వాసి డిమాండ్

  • సినిమాలో హీరోయిన్ వాడిన ఫోన్ నంబర్ తనదంటున్న జార్ఖండ్ వాసి  
  • తనకు పలువురు ఫోన్ చేసి వేధించారంటున్న బాధితుడు 
  • 50 లక్షలు చెల్లించాలంటూ కోర్టుకెక్కిన వైనం 
ప్రముఖ నటుడు నాగార్జున తనను చాలా ఇబ్బంది పెట్టారని, తన పనికి అంతరాయం కలిగేలా చేయడం వల్ల తాను చాలా నష్టపోయానని, దీనికి పరిహారంగా 50 లక్షల రూపాయలు చెల్లించాలని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వికాస్ ప్రజాపతి కోర్టుకెక్కినట్టు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో అక్కినేని అఖిల్ హీరోగా విడుదలైన 'హలో' సినిమాలో హీరోయిన్ కల్యాణి ఫోన్ నంబర్ తాను వాడుతున్న నంబర్ ఒకటే కావడంతో పలువురు అభిమానులు ఫోన్ చేసి, 'కల్యాణివేనా? ఏం చేస్తున్నావ్?' అంటూ విసిగిస్తున్నారని వాపోయాడు.

అసలీ కల్యాణి ఎవరు? ఇంతమంది ఎందుకు ఫోన్లు చేస్తున్నారని ఆరాతీయగా, 'హలో' సినిమాలో హీరోయిన్ వాడిన నంబర్‌ గా తన నెంబర్ ను పేర్కొన్నారని, దీంతో తన నెంబర్ కు ఫోన్ చేసి విసిగిస్తున్నారని తెలిసిందని పేర్కొంటూ, అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. కాగా, దీనిపై స్పందించిన నాగ్... తాము టెలికాం ఆపరేటర్ అనుమతి తీసుకున్నాకే సినిమాలో ఆ నంబర్ ను వినియోగించుకున్నామని, ఇలా జరుగుతుందని ఊహించలేదని అన్నట్టు సమాచారం.
hellow movie
vikas prajapati
kalyani
mobile number

More Telugu News