సీపీఐ నేత రామకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత జోగి రమేష్!

  • రామకృష్ణ సీపీఐ నేత కాదు 'చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా' నేత 
  • జగన్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
  • అచ్చెన్నాయుడు, కామినేని, ఆదినారాయణరెడ్డిపై మండిపడ్డ జోగి రమేష్
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతిస్తామని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు గుప్పించడం తెలిసిందే. ఈ విషయమై వైసీపీ నేత జోగి రమేష్ స్పందించారు. విజయవాడలోని తమ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కమ్యూనిస్ట్ ఫార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నేతగా కాకుండా, చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా నేతగా రామకృష్ణ మాట్లాడుతున్నారని విమర్శించారు.

చంద్రబాబుకు రామకృష్ణ తొత్తుగా మారారని, ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేకపోతే చంద్రబాబుకు అమ్ముడుపోయారని అనుకుంటారని విమర్శించారు. టీడీపీ మంత్రులు అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డిపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ మంత్రులు కనీస ఇంగితజ్ఞానం లేకుండా మతితప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Go Back to Shorts
Telugudesam
YSRCP
jogi ramesh

More Telugu News