ద‌క్షిణాది న‌టి భావ‌న పెళ్లి సందర్భంగా ప్రియాంక చోప్రా విషెస్‌.. వైర‌ల్ అవుతున్న వీడియో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ద‌క్షిణాది న‌టి భావ‌న పెళ్లి సందర్భంగా ప్రియాంక చోప్రా విషెస్‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

  • అమేజింగ్ ఉమెన్ అంటూ పొగిడిన ప్రియాంక‌
  • ఇవాళ బాయ్‌ఫ్రెండ్ న‌వీన్‌ని పెళ్లి చేసుకోబోతున్న భావ‌న‌
  • గ‌తేడాది మార్చిలో జ‌రిగిన నిశ్చితార్థం
మ‌ల‌యాళ న‌టి భావ‌న‌, తన బాయ్‌ఫ్రెండ్ న‌వీన్‌ని ఇవాళ పెళ్లి చేసుకోబోతోంది. ఆమె పెళ్లికి కొన్ని గంట‌ల ముందు బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా ఒక స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆమె పెళ్లికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ప్రియాంక ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో భావ‌న‌ను గొప్ప మ‌హిళ‌, ధైర్య‌వంతురాలిగా కొనియాడింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

'నీకు పెళ్లి సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు. నీ జీవితంలో కొత్త అడుగు వేయ‌బోతున్నావ్‌. అందుకు నీకు గుడ్‌ల‌క్‌. నువ్వొక అమేజింగ్ ఉమెన్‌. నువ్వంటే నాకు చాలా గౌర‌వం' అని ప్రియాంక వీడియోలో పేర్కొంది. గ‌తేడాది మార్చిలో భావ‌న, న‌వీన్‌ల వివాహ నిశ్చితార్థం జ‌రిగింది. ఆ వేడుక‌కు సంబంధించిన ఫొటోలు కూడా ఇంటర్నెట్‌లో వైర‌ల్‌గా మారాయి. తెలుగులో భావ‌న 'మ‌హాత్మ‌' చిత్రంలో శ్రీకాంత్ స‌ర‌స‌న క‌నిపించింది.

south actress
priyanka chopra
bhavana

More Telugu News