మధ్యప్రదేశ్ గవర్నర్గా మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి
- మధ్యప్రదేశ్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓపీ కోహ్లీ
- 2014 నుంచి రెండేళ్లపాటు గుజరాత్ సీఎంగా పనిచేసిన ఆనందీబెన్
నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక 2014లో 76 ఏళ్ల ఆనందీబెన్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు, 2016 వరకు గుజరాత్ సీఎంగా పనిచేసిన ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ పదవీకాలం ముగియడంతో గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయన నుంచి ఆనందీబెన్ పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు.