మాజీ భార్యను మళ్లీ పెళ్లాడనున్న బాలీవుడ్ స్టార్ హీరో!
Add ap7am to your home Screen

మాజీ భార్యను మళ్లీ పెళ్లాడనున్న బాలీవుడ్ స్టార్ హీరో!

  • 2014లో విడిపోయిన హృతిక్, సుసాన్నే
  • మళ్లీ దగ్గరవుతున్న జంట
  • పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మళ్లీ పెళ్లికి సిద్ధమవుతున్నాడనే వార్తలు బీ టౌన్ లో చక్కర్లు కొడుతున్నాయి. తన మాజీ భార్య సుసాన్నే ఖాన్ నే హృతిక్ మరోసారి పెళ్లాడబోతున్నాడని చెబుతున్నారు. వీరిద్దరూ ప్రేమించుకుని 2000లో పెళ్లి చేసుకున్నారు. 2014లో విడిపోయారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. అయితే వీదిద్దరూ విడిపోయినప్పటికీ అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు. ఇటీవల హృతిక్ పుట్టినరోజు సందర్భంగా సుసాన్నే చేసిన ట్వీట్ అందరినీ ఆకర్షించింది. తన జీవితంలో ఎప్పటికీ హృతికే వెలుగని... ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలని ట్వీట్ చేసింది. అంతేకాదు స్వయంగా బర్త్ డే పార్టీకి వెళ్లి విష్ చేసింది. దీంతో, వీరిద్దరూ మళ్లీ కలవబోతున్నారని అందరూ చెబుతున్నారు. 
hrithik roshan
susanne khan

More Telugu News