నా భర్తే ఉత్తముడంటూ, నాగార్జునను ఆటపట్టించిన సమంత!
- అన్నపూర్ణ స్టూడియోస్ లో సంక్రాంతి సంబరాలు
- వర్కర్స్ తో కలసి భోజనం చేసిన నాగ్ ఫ్యామిలీ
- జోక్స్ తో అంతా ఉల్లాసం, ఉత్సాహమేనన్న నాగ్
అందరమూ అన్నపూర్ణా స్టూడియోలోనే కలిశామని, స్టూడియోను ప్రారంభించి 42 సంవత్సరాలు అయిన సందర్భంగా, ప్రతి ఒక్కరికీ సమంత భోజనాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆ సమయంలో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండి జోక్స్ వేసుకున్నామని అన్నారు. సమంత 'మై హస్బెండ్ ఈజ్ ది బెస్ట్' అనగానే, తామంతా షాక్ తిన్నామని చెప్పారు. ఆ వెంటనే "మేమందరం మా భార్యలకు మంచి భర్తలం కాదా?" అని అడుగగా, దానికి గడుసుగా "లేదు. మై హస్బెండ్ ఈజ్ ది బెస్టెస్ట్" అంటూ తామందరినీ ఆటపట్టించిందని అన్నారు.