'జైసింహా'కు పాజిటివ్ రెస్పాన్స్.. నరసింహా పాత్రలో బాలయ్య మార్క్ అభినయం!
Add ap7am to your home Screen

'జైసింహా'కు పాజిటివ్ రెస్పాన్స్.. నరసింహా పాత్రలో బాలయ్య మార్క్ అభినయం!

  • ఈ రోజే విడుదలైన 'జై సింహా'
  • కంటెంట్ కి మంచి మార్కులు 
  • బాలకృష్ణ అభిమానుల సందడి
బాలకృష్ణ సినిమా టైటిల్స్ లో 'సింహా' అని ఉంటే చాలు .. ఇక ఆ సినిమా సూపర్ హిట్టే అనేది ఆయన అభిమానుల నమ్మకం. బాలకృష్ణ సెంటిమెంట్ కూడా అదే. అలా తనకిష్టమైన 'జై సింహా' టైటిల్ తో .. తనకి సెంటిమెంట్ అయిన సంక్రాంతి సందర్భంలో ఆయన ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా చూసినవాళ్లు బాలకృష్ణ అదరగొట్టేశాడని అంటున్నారు.

'నరసింహా' పాత్రలో ఆయన అద్భుతంగా నటించారని చెబుతున్నారు. బాలకృష్ణ మార్క్ ఫైట్లు .. డాన్సులు ఆయన అభిమానులలో ఉత్సాహాన్ని రేకెత్తించేలా ఉన్నాయని అంటున్నారు. ఇక కొన్ని సన్నివేశాల్లో ఆయన నాన్ స్టాప్ గా చెప్పే డైలాగ్స్ బాలయ్య అభిమానులతో విజిల్స్ వేయిస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆయన నటనకి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.  బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అవుతుందేమో చూడాలి మరి.         
balakrishna
nayanathara

More Telugu News