పవన్ .. త్రివిక్రమ్ ల పారితోషికమే 50 కోట్లు?
Add ap7am to your home Screen

పవన్ .. త్రివిక్రమ్ ల పారితోషికమే 50 కోట్లు?

  • త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ కి క్రేజ్ 
  • అదే కాంబినేషన్లో వచ్చిన 'అజ్ఞాతవాసి' 
  • ఇద్దరి పారితోషికాలపై ఫిల్మ్ నగర్ టాక్    
రచయితగా .. దర్శకుడిగా త్రివిక్రమ్ కి గల ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఇక హీరోగా పవన్ కల్యాణ్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'జల్సా' .. ' అత్తారింటికి దారేది' సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో, ఇది క్రేజీ కాంబినేషన్ గా మారిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ కాంబినేషన్లో వచ్చే సినిమాలకి ఒక రేంజ్ లో మార్కెట్ వుంది.

 ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికీ భారీ మొత్తంలో పారితోషికాలు ముడుతున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. అంతకు ముందు సినిమాల సంగతి అటుంచితే, 'అజ్ఞాతవాసి' సినిమాకి గాను త్రివిక్రమ్ 20 కోట్లు పారితోషికం తీసుకోగా, పవన్ కి 30 కోట్ల పారితోషికం ముట్టిందని చెప్పుకుంటున్నారు. ఇద్దరి పారితోషికమే 50 కోట్ల వరకూ అయిందన్న మాట. ఇక సంగీత దర్శకుడిగా అనిరుథ్ కి 3 కోట్ల వరకూ ముట్టినట్టు సమాచారం.   
pavan
keerthi suresh
anu

More Telugu News