ఆ ఫెయిల్యూర్ నాన్నగారిది కాదు.. కచ్చితంగా నాదే!: దాసరి అరుణ్ కుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ ఫెయిల్యూర్ నాన్నగారిది కాదు.. కచ్చితంగా నాదే!: దాసరి అరుణ్ కుమార్

  • నన్ను హీరోగా నిలబెట్టాలనేది నాన్నగారి కోరిక 
  • ఫెయిల్యూర్స్ వలన నాలో ఏర్పడిన డౌట్ 
  • అందువలన మాట దాటేస్తూ వచ్చేవాడిని    
దాసరి నారాయణరావు తనయుడు అరుణ్ కుమార్ .. చాలాకాలం క్రితమే 'గ్రీకు వీరుడు' .. 'ఆదివిష్ణు' వంటి సినిమాలు చేశాడు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లోను కనిపించాడు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడాడు. "దాసరి నారాయణ రావు గారు ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేశారు .. ఎంతోమంది నటీనటులకు కెరియర్ ను ఇచ్చారు. అలాంటి ఆయన 'పిల్లల విషయంలో ఫెయిలయ్యాను' అని పదే పదే అనేవారు ఎందుకని?' అనే ప్రశ్న అరుణ్ కుమార్ కి ఎదురైంది.

 అందుకాయన స్పందిస్తూ .. ' నాన్నగారి ప్రతి ఇంటర్వ్యూను నేను చూశాను .. ఆయన నన్నొక  హీరోగా నిలబెట్టాలనుకున్నారు .. కానీ అది సక్సెస్ కాలేదు. అది ఆయన ఫెయిల్యూర్ కాదు .. నా ఫెయిల్యూర్.  ఈ ఫీల్డ్ కి నేను కరెక్టా? కాదా? అనే చిన్న డౌట్ వుంది .. అందువలన నేను ముందుకు వెళ్లలేకపోయాను. 'ఇంతమందికి లైఫ్ ఇచ్చానే .. ఇంకోసారి ప్రయత్నించు' అని నాన్నగారు అనేవారు. 'నేను ఏదో ఒకటి చెప్పి మాట దాటేస్తూ ఉండేవాడిని' అని చెప్పుకొచ్చాడు.    
dasari arun kumar

More Telugu News