దీపికా పుట్టినరోజుకి ఖరీదైన వజ్రాల హారం బహుమతిగా ఇచ్చిన రణ్వీర్ తల్లిదండ్రులు
- ఓ ఖరీదైన చీర కూడా
- మాల్దీవుల్లో జరిగిన పుట్టినరోజు వేడుకలు
- నిశ్చితార్థం జరిగినట్లు పుకార్లు
గత నాలుగేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్న దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్‌ల నిశ్చితార్థం జరిగిందని, విరాట్-అనుష్కల పెళ్లి ఆదర్శంగా తీసుకుని వీరు కూడా తమ వివాహాన్ని సింపుల్ గా, ప్రైవేటు వ్యవహారంగా నిర్వహించుకోవాలనుకుంటున్నారని కథనాలు వచ్చాయి. అయితే గతంలో చాలా సార్లు దీపికా, రణ్‌వీర్‌ల కుటుంబాలు కలిసి విహారయాత్రలకు, పర్యటనలకు వెళ్లడం జరిగింది. దీంతో ఈ పుట్టినరోజు మాల్దీవుల ట్రిప్ కూడా అలాంటిదేనని, నిశ్చితార్థం జరిగిన దాఖలాలు కనిపించడం లేదని మరికొందరు చెబుతున్నారు.