రోడ్లపై కనబడితే కత్తి మహేశ్ ను కొడతాం: పవన్ యూత్ అధ్యక్షుడు

  • లైవ్ షో జరుగుతుండగా హెచ్చరిక
  • పవన్ పై ఇదే మాదిరి విమర్శలు, ఆరోపణలు చేస్తే ఊరుకోం
  •  మీడియాకు దొరికిన కార్టూన్ కత్తి మహేశ్
  • విజయవాడ పవన్ కల్యాణ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ తీవ్ర వ్యాఖ్యలు
రోడ్లపై కనబడితే కత్తి మహేశ్ ని కొడతామని విజయవాడ పవన్ కల్యాణ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కుమార్ హెచ్చరించారు. ‘టీవీ9’ లైవ్ షో జరుగుతుండగా నేరుగా కత్తి మహేశ్ ని ఆయన హెచ్చరించడం గమనార్హం. కత్తి మహేశ్ మానసిక పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని, కోలుకున్నట్టు లేదని విమర్శించారు.

‘కోన వెంకట్ గారు మీకు ఓపెన్ గా చెప్పారు..రిక్వెస్ట్ చేశారు. మేము అయితే బహిరంగంగా చెబుతున్నాం.. ‘మీరు ఎక్కడ తిరిగినా సరే, పవన్ ఫ్యాన్స్ కొడతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని రోడ్లపై తిరగండి. ఇతని (కత్తి మహేశ్) గురించి ఓపెన్ గా చెప్పాలంటే.. ఇతనో కార్టూన్. ఇతను మీడియాకు దొరికిన కార్టూన్’ అంటూ ఇబ్బందికర పదజాలంతో కత్తి మహేశ్ ను ఆయన దూషించారు. పవన్ కల్యాణ్ ని అజ్ఞాని అని ఆయన ఎలా అంటారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ పై ఇదే మాదిరి విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే ఆయన ఫ్యాన్స్ కాదు, జనాలే కొడతారని హెచ్చరించడం గమనార్హం.
Go Back to Shorts
Pawan Kalyan
Kathi Mahesh

More Telugu News