మా అమ్మను బూతులు తిడితే చూస్తూ ఊరుకుంటానా?: పవన్ ఫ్యాన్స్ పై కత్తి మహేష్ నిప్పులు
Add ap7am to your home Screen

మా అమ్మను బూతులు తిడితే చూస్తూ ఊరుకుంటానా?: పవన్ ఫ్యాన్స్ పై కత్తి మహేష్ నిప్పులు

  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదు
  • పది ప్రశ్నలు వేస్తే, ఒక్క ప్రశ్నకూ సమాధానం లేదు
  • తల్లిని, భార్యను తిడితే ఊరుకోవాలా?
  • ప్రెస్ క్లబ్ లో కత్తి మహేష్
రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదని, తాను పది ప్రశ్నలు వేస్తే, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదని కత్తి మహేష్ విమర్శలు గుప్పించాడు. కొద్దిసేపటి క్రితం ప్రెస్ క్లబ్ వేదికగా, మీడియాతో మాట్లాడిన ఆయన, పవన్ ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డాడు. తన తల్లిని, భార్యను నోటితో చెప్పలేని విధంగా బూతులు తిడుతుంటే తాను చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించాడు. తన అభిమానులను కూడా నియంత్రణలో ఉంచుకోలేని స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నాడని ఆరోపించాడు.

తాను పవన్ లేదా పూనం కౌర్ ను చర్చించేందుకు రమ్మని ఆహ్వానం పంపించానని, కానీ వారు రాలేదని అన్నాడు. తనను సామాజిక బహిష్కరణ చేయాలని కోన వెంకట్ చేసిన డిమాండును ప్రస్తావిస్తూ, ఓ దళితుడిగా తాను ఎన్నోసార్లు సామాజిక బహిష్కరణను చూశానని, సినీ ఇండస్ట్రీ నుంచి కూడా బహిష్కరించారని ఆరోపించాడు. మరికాసేపు తాను వారి కోసం వేచి చూస్తానని చెప్పిన కత్తి మహేష్, తాను చెప్పాలనుకుంది చెబుతానే తప్ప మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పేది లేదని స్పష్టం చేయడం గమనార్హం.
Kathi Mahesh
Pawan Kalyan
press club

More Telugu News