మద్యంపై పూర్తి నిషేధం ఉన్న ప్రాంతంలో మందుబాబుల వినూత్న ప్లాన్... చూసి కూడా ఏమీ చేయలేకపోయిన పోలీసులు!

అది న్యూజిలాండ్ కు సమీపంలో ఉన్న కోరమాండల్ ద్వీపకల్పం. అక్కడ మద్యంపై పూర్తి నిషేధం అమలవుతూ ఉంటుంది. పోలీసులు గట్టి నిఘా, పెట్రోలింగ్ ను అమలు చేస్తుంటారు కూడా. ఇక అక్కడి యువతీ యువకులు కొందరు ఎలాగైనా కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకోవాలని నిర్ణయించి వినూత్న ప్లాన్ వేశారు. వారి ప్లాన్ గురించి తెలిసి, వారు మందు కొడుతున్నారని తెలిసి కూడా పోలీసులు ఏమీ చేయలేకపోయారు.

ఇంతకీ వారు చేసిందేంటో తెలుసా? చుట్టూ ఉన్న సముద్ర జలాల్లో నీరు అంతగా లేని చోట, ఇసుకతో ఓ చిన్న దిబ్బ కట్టుకున్నారు. దానిపై బల్లలు వేసుకుని మందు కొడుతూ ఎంజాయ్ చేశారు. వారు సాంకేతికంగా న్యూజిలాండ్ లో లేనట్టు. అంతర్జాతీయ జలాల్లో తాము ఉన్నామని, పోలీసులు ఎలా పట్టుకుంటారని వాదించిన వారిని ఏమీ చేయలేకపోయారట. అదీ సంగతి!

Newzeland
new year party
Ocean
International water

More Telugu News