కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్!: పవన్ పై కత్తి మహేష్ ఫైర్
Add ap7am to your home Screen

కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్!: పవన్ పై కత్తి మహేష్ ఫైర్

  • పవన్ ట్వీట్ కు కత్తి మహేష్ ఘాటు రిప్లై
  • వ్యక్తిత్వం గురించి నీవు మాట్లాడకపోతేనే బెటర్
  • పెట్టే గడ్డేదో మీ వాళ్లకే పెట్టు
'వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లే... నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు' అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ మెసేజ్ ను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ చేసిన ఈ ట్వీట్ పట్ల సినీ క్రిటిక్ కత్తి మహేష్ అదే స్థాయిలో స్పందించాడు. 'ధనం, వర్ణం, కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్... నేను కాదు' అంటూ తీవ్ర స్థాయిలో కామెంట్ చేశారు. కాబట్టి పెట్టే గడ్డి ఏదో వాళ్లకే పెట్టాలంటూ సూచించారు.

ఇక వ్యక్తిత్వం విషయానికి వస్తే దాని గురించి నీవు మాట్లాడకపోతేనే బెటర్ అంటూ ఎద్దేవా చేశారు. 'అనవసరంగా కడుపు చించుకుంటే... కాళ్ల మీద పడుతుంది, జాగ్రత్త' అంటూ ఫేస్ బుక్ లో స్పందించారు. ఈ కామెంట్ కు 'మీలో మీరు మాట్లాడుకుంటున్నారా?' అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా... పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ కు సమాధానం ఇచ్చానంటూ స్పష్టం చేశారు కత్తి మహేష్.
Pawan Kalyan
Kathi Mahesh
Tollywood
janasena

More Telugu News