విజయ్ జోడీగా మరోసారి ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేశ్
Add ap7am to your home Screen

విజయ్ జోడీగా మరోసారి ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేశ్

  • విజయ్ తో మురుగదాస్ 
  • విజయ్ కి ఇది 62వ సినిమా 
  • సంగీత దర్శకుడిగా రెహ్మాన్
తమిళంలో మాస్ హీరోగా విజయ్ కి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రానికి సన్నాహాలు మొదలయ్యాయి. విజయ్ కెరియర్లో 62వ సినిమా ఇది. ఈ సినిమాకి మురుగదాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ను తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ విజయ్ జోడీ కట్టే ఛాన్స్ ను కీర్తి సురేశ్ దక్కించుకుందనేది తాజా సమాచారం.

గతంలో విజయ్ సరసన కీర్తి సురేశ్ ..' భైరవ' అనే సినిమా చేసింది. విజయ్ తో కలిసి నటించే ఛాన్స్ ఒకసారి దక్కితేనే చాలనుకునే హీరోయిన్స్ వున్నారు. అలాంటిది కీర్తి సురేశ్ కి మరోసారి ఈ ఛాన్స్ దక్కడం విశేషంగానే చెప్పుకోవాలి. సన్ గ్రూప్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ, ఇతర కథానాయికలకు కీర్తి సురేశ్ గట్టిపోటీనే ఇస్తోందని చెప్పాలి.        
vijay
keerthi suresh

More Telugu News