ఫేస్‌బుక్‌లో వైసీపీ అధినేత జగన్‌పై అభ్యంతరకర పోస్టు.. కేసు నమోదు

  • కృష్ణా జిల్లా కోసూరుకు చెందిన సురేశ్ కుమార్‌పై కేసు నమోదు
  • ఫేస్‌బుక్ ఖాతా ఆధారంగా దర్యాప్తు ప్రారంభం
  • త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామన్న  పోలీసులు
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై సోషల్ మీడియాలో అభ్యంతరకపోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరుకు చెందిన పరుచూరి సురేశ్ కుమార్ ఇటీవల జగన్‌పై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టు పెట్టాడు. దీనిని గమనించిన పామర్రు వైసీపీ ఇన్‌చార్జ్ అనిల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫేస్‌బుక్ ఖాతా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే సురేశ్‌ను అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. అయితే వైసీపీ చీఫ్‌పై సురేష్ పెట్టిన పోస్టు ఏంటనే విషయంలో స్పష్టత లేదు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

ఇటీవల రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారి సంఖ్య ఎక్కువైంది. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇటువంటి పోస్టులు పెడుతున్న వారిపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. గతంలో ఇటువంటి పోస్టులు  పెట్టిన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. ప్రస్తుతం జగన్ ప్రజా సంకల్ప యాత్రలో బిజీగా ఉన్నారు.
Go Back to Shorts
YSRCP
Jagan
Facebook
Andhra Pradesh

More Telugu News