కాంగ్రెస్, బీజేపీ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం: కేటీఆర్

KTR Vows to Free Telangana from Congress BJP Rule
  • ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్ అన్న కేటీఆర్
  • పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను అగ్రభాగన నిలపెట్టారని ఉద్ఘాటన
  • ప్రజలు ఇచ్చిన పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా పోషిస్తోందని వ్యాఖ్యలు
కాంగ్రెస్, బీజేపీ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించి మళ్లీ బీఆర్ఎస్‌ను పట్టాలెక్కించేందుకు పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అడుగడుగునా పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన పార్టీ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టారని అన్నారు. 14 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేశారని, ఆ తర్వాత పదేళ్లు మంచి పాలన అందించారని అన్నారు. దశాబ్దాలుగా దగాపడ్డ తెలంగాణ కోసం అన్ని పదవులు వదులుకొని, 25 సంవత్సరాల క్రితం ఇదే రోజు జలదృశ్యంలో కేసీఆర్ పార్టీని స్థాపించారని తెలిపారు.

తెలంగాణ కోసం కేసీఆర్ ఉద్యమించి, తెలంగాణ ప్రజలను, జాతిని ఐక్యం చేసి ఢిల్లీ మెడలు వంచారని అన్నారు. తెలంగాణను సాధించాక ప్రజలు అధికారం ఇస్తే, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన పెట్టిన నాయకుడు కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం ఈ రెండున్నరేళ్ళలుగా ఈ దుర్మార్గపు పాలనలో అణచివేతలకు గురవుతున్న ప్రజలకు బీఆర్ఎస్ గొంతుకై నిలుస్తోందని అన్నారు. ఉద్యమ పార్టీగా, 10 ఏళ్లు అధికార పార్టీగా, రెండున్నరేళ్లు ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఇచ్చిన ప్రతి పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా పోషిస్తోందని అన్నారు.
Go Back to Shorts
KTR
BRS
Telangana
KCR
Congress
BJP
Telangana Politics
BRS Party
Telangana Development

More Telugu News