దిల్ రాజు ఫోన్ చేసి మెచ్చుకోవడమే కాదు .. మళ్లీ ఛాన్స్ ఇచ్చాడట!
Add ap7am to your home Screen

దిల్ రాజు ఫోన్ చేసి మెచ్చుకోవడమే కాదు .. మళ్లీ ఛాన్స్ ఇచ్చాడట!

  • 'మిడిల్ క్లాస్ అబ్బాయ్'కి మంచి రెస్పాన్స్ 
  • దిల్ రాజు అభినందించారు
  • ఎంతో ఆనందంగా ఉందంటున్న వేణు శ్రీరాం   
నిర్మాతగా .. డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకు ఎంతో అనుభవం వుంది. అన్ని వర్గాలవారిని థియేటర్స్ కి రప్పించే మంత్రం ఆయనకి బాగా తెలుసు. ఒకసారి ఫ్లాప్ ఇచ్చిన దర్శకులకు సైతం .. కథపై గల నమ్మకంతో మరోసారి ఛాన్స్ ఇచ్చిన నిర్మాత ఆయన. అలా 'ఓ మై ఫ్రెండ్' సినిమాతో ఒక ఫ్లాప్ తీసిన వేణు శ్రీరామ్ కి, 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' తో మళ్లీ అవకాశం ఇచ్చారు.

ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, యూనిట్ సభ్యులంతా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ సందర్భంగా వేణు శ్రీరామ్ మాట్లాడుతూ, " 'ఓ మై ఫ్రెండ్' పరాజయం పాలైనా దిల్ రాజు గారు నాపై గల నమ్మకంతో మరో అవకాశం ఇవ్వడం నిజంగా విశేషం. 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సక్సెస్ టాక్ రావడంతో దిల్ రాజు గారు ఫోన్ చేసి అభినందించారు. అంతేకాదు .. మరో సినిమా చేద్దామని కూడా ఆయన అనడం నాకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది" అని చెప్పుకొచ్చాడు.  
venu sriram
dil raju

More Telugu News