Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న్యూఇయ‌ర్ వేడుక‌ల‌కి సిద్ధ‌మైన బుర్జ్ ఖ‌లీఫా... వీడియో చూడండి!

  • బాణ‌సంచాకు బ‌దులుగా లేజ‌ర్ షో
  • 'లైట్ అప్ 2018' పేరుతో వేడుక‌
  • టీజ‌ర్ విడుద‌ల చేసిన బుర్జ్ ఖలీఫా
న్యూఇయ‌ర్ వేడుక‌లు నిర్వ‌హించ‌డంలో దుబాయ్ ప్ర‌త్యేక‌తే వేరు. అందుకే ప్ర‌పంచ న‌లుమూల‌ల నుంచి ప్ర‌త్యేకంగా కొత్త‌ సంవ‌త్స‌రాన్ని జ‌రుపుకోవ‌డం కోసం ప‌ర్యాట‌కులు అక్క‌డికి వెళ్తారు. ఈ ప‌ర్యాట‌కుల కోస‌మే ప్ర‌త్యేకంగా అక్క‌డి బుర్జ్ ఖ‌లీఫా ముస్తాబవుతుంది. డిసెంబ‌ర్ 31 అర్థ‌రాత్రి అక్క‌డ జ‌రిగే కౌంట్‌డౌన్‌, త‌ర్వాత కాల్చే బాణ‌సంచా ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలుస్తాయి.

ఇంకో మూడు రోజుల్లో న్యూఇయ‌ర్ రాబోతున్న సంద‌ర్భంగా బుర్జ్ ఖ‌లీఫా ముస్తాబైంది. ఈసారి బాణ‌సంచాకు బ‌దులుగా లేజ‌ర్ షోతో అల‌రించాల‌ని వేడుక నిర్వాహ‌కులు నిశ్చ‌యించుకున్నారు. లేజ‌ర్ షోతో పాటు రోప్ వాక్‌లు, లైటింగ్ కౌంట్‌డౌన్ వంటి ఎన్నో హంగుల‌ను వారు తీర్చిదిద్దిన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త‌మ అధికారిక ట్విట్ట‌ర్‌లో ఓ టీజ‌ర్ వీడియోను కూడా వారు విడుద‌ల చేశారు. 'లైట్ అప్ 2018' పేరుతో నిర్వ‌హించనున్న ఈ వేడుక ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవ‌డానికి ఈ ఒక్క టీజ‌ర్ చాల‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
new year
burj khalifa
light up 2017

More Telugu News