ట్యాక్సీ అనుకుని పోలీసుల కారెక్కిన స్మగ్లర్.. అడ్డంగా బుక్కైన వైనం!
Add ap7am to your home Screen

ట్యాక్సీ అనుకుని పోలీసుల కారెక్కిన స్మగ్లర్.. అడ్డంగా బుక్కైన వైనం!

  • గంజాయి సంచితో పోలీసుల కారెక్కిన స్మగ్లర్
  • పోలీసులను చూసి అవాక్కు
  • ట్విట్టర్ ద్వారా తెలిపిన డెన్మార్క్ పోలీసులు
పోలీసుల నుంచి తప్పించుకోవాల్సిన ఓ స్మగ్లర్ పొరపాటున నేరుగా వారి కారే ఎక్కాడు. యూరప్‌లోని డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ అయింది. కోపెన్‌హాగ్‌లోని ఫ్రీటౌన్ క్రిస్టియానా ప్రాంతానికి చెందిన ఓ స్మగ్లర్ వెయ్యి గంజాయి మొక్కలను సంచిలో వేసుకుని తరలించేందుకు సిద్ధమయ్యాడు.

రోడ్డు మీదకు వచ్చి ట్యాక్సీ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. ఈ లోపు ఓ వాహనం వచ్చి ఆగడంతో హడావుడిగా ఉన్న స్మగ్లర్ వెనకాముందు చూడకుండా కారు ఎక్కేశాడు. తర్వాత అందులో ఉన్న పోలీసులను చూసి నిశ్చేష్టుడయ్యాడు. అప్పటికే వాసన గుప్పుమనడంతో అప్రమత్తమైన పోలీసులు అతడి సంచిని వెతగ్గా అందులో గంజాయి మొక్కలు కనిపించాయి. దీంతో అతడిని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని కోపెన్‌హాగ్ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. గంజాయి స్మగ్లర్ నేరుగా పోలీసు వాహనమే ఎక్కాడన్న వార్త ఇప్పుడు వైరల్ అయింది.
Taxi
Police
Denmark
kopenhagen
smuggler

More Telugu News