వినాయక్ .. తేజు మధ్య ఎలాంటి గొడవ లేదట!
Add ap7am to your home Screen

వినాయక్ .. తేజు మధ్య ఎలాంటి గొడవ లేదట!

  • సాయిధరమ్ తేజ్ హీరోగా వినాయక్ మూవీ
  • 'ఎవడు'కి సీక్వెల్ అంటూ టాక్ 
  • ఇదంతా ప్రచారం మాత్రమేనట
వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా గతంలో వినాయక్ తెరకెక్కించిన 'నాయక్' సినిమాకి సీక్వెల్ అనేది ఆ వార్త సారాంశం.

ఈ విషయంలోనే వినాయక్ తో తేజు గొడవపడినట్టుగా కూడా చెప్పుకుంటున్నారు. 'నాయక్' సినిమా అప్పట్లో యావరేజ్ గా ఆడింది. అలాంటి సినిమాకి సీక్వెల్ చేసే సాహసం వినాయక్ చేయడు. ఇక తనతో వినాయక్ చేసే సినిమా కథ ఏమిటనే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చిన తరువాతనే, తేజు రంగంలోకి దిగాడు. కనుక ఈ విషయమై ఆయన వినాయక్ తో గొడవ పెట్టుకునే ఛాన్స్ లేదు. అందువలన ఇదంతా కేవలం ప్రచారమే కానీ .. ఎంత మాత్రం నిజం లేదనేది యూనిట్ సభ్యుల మాట.      
vinayak
sai dharam tej

More Telugu News