‘జై సింహా’ ఆడియో ఫంక్షన్ అందరినీ కలిపిన ఓ మహాసభ: ప్రముఖ నటుడు బాలకృష్ణ
Add ap7am to your home Screen

‘జై సింహా’ ఆడియో ఫంక్షన్ అందరినీ కలిపిన ఓ మహాసభ: ప్రముఖ నటుడు బాలకృష్ణ

  • ఎన్నో గొప్ప వేషాలు వేసిన ఘనత ఎన్టీఆర్ ది
  • అలాంటి వేషాల్లో నటించే గుణం నాకు అబ్బింది
  • ఆంధ్ర రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి: బాలయ్య
‘జై సింహా’ ఆడియో ఫంక్షన్ అందరినీ కలిపిన ఓ మహాసభ అని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. ‘జై సింహా’ ఆడియో సీడీ ఆవిష్కరణలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఎన్నో గొప్ప వేషాలు చేసిన ఘనత తన తండ్రి ఎన్టీఆర్ ది అయితే, అలాంటి వేషాల్లో నటించే గుణం తనకు అబ్బిందని, తాను నటించిన పాత్రలన్నింటికి న్యాయం చేశానో లేదో చెప్పేది అభిమానులు మాత్రమేనని అన్నారు.

‘జై సింహా’ చిత్ర యూనిట్ ఓ ఎన్ సైక్లోపీడియా అని కితాబిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని, పరిశ్రమ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. కాగా, తన ప్రసంగం అనంతరం అభిమానుల కోరిక మేరకు ‘జై సింహా’ సినిమాలోని డైలాగ్స్ ను బాలయ్య వినిపించడంతో అభిమానుల చప్పట్లు మార్మోగిపోయాయి.
Balakrishna
nara

More Telugu News