అరాచక శక్తులకు ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ బాలకృష్ణ: వర్ల రామయ్య
Add ap7am to your home Screen

అరాచక శక్తులకు ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ బాలకృష్ణ: వర్ల రామయ్య

  • ఫ్యాక్షనిజాన్ని ఇనుప పాదాలతో తొక్కే ‘సమరసింహారెడ్డి’
  • ‘చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా మీరే’
  • ‘జై సింహా’ ఆడియో వేడుకలో వర్ల రామయ్య
అరాచకశక్తులకు ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ బాలకృష్ణ అని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశంసించారు. ‘జై సింహా’ ఆడియో వేడుకలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఫ్యాక్షనిజాన్ని ఇనుప పాదాలతో తొక్కే సమరసింహారెడ్డి బాలకృష్ణ అంటూ, బాలయ్య నటించిన చిత్రాల పేర్లను ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. ‘చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా మీరే’ అంటూ బాలయ్య వైపు చూస్తూ వర్ల రామయ్య అనడంతో నవ్వులు విరిశాయి. ‘బాలకృష్ణ-నయనతార కాంబినేషన్ అద్భుతం. తెరవెనుక  కాంబినేషన్ గురించి నేను మాట్లాడటం లేదు. తెర ముందు మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే.. ప్రతి యువకుడు కూడా నా భార్య ఇలా ఉంటే, నా సంసారం కూడా ఇలా ఉంటే బాగుంటుందని.. కొత్తగా పెళ్లి అయిన వాళ్లు కూడా అనుకుంటున్నారు’ అని చెప్పుకొచ్చారు. 
Balakrishna
varla

More Telugu News