అమితాబ్ బ‌చ్చ‌న్ ఐకాన్ అవార్డు అందుకున్న విజ‌య్ సేతుప‌తి
Add ap7am to your home Screen

అమితాబ్ బ‌చ్చ‌న్ ఐకాన్ అవార్డు అందుకున్న విజ‌య్ సేతుప‌తి

  • చెన్నై అంత‌ర్జాతీయ చిత్రోత్స‌వాల్లో అవార్డు
  • విక్ర‌మ్ వేదా చిత్రంలో న‌ట‌న‌కు గుర్తింపు
  • ఉత్త‌మ చిత్రంగా ఒరు కిడారియిన్ క‌రుణై మ‌ను
ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి అమితాబ్‌బ‌చ్చ‌న్ ఐకాన్ అవార్డును అందుకున్నారు. చెన్నైలో జ‌రు‌గుతున్న 15వ చెన్నై అంత‌ర్జాతీయ చిత్రోత్స‌వాల్లో ఆయ‌న ఈ అవార్డు అందుకున్నారు. 'విక్ర‌మ్ వేదా' చిత్రంలో న‌ట‌న‌కు గాను ఆయ‌న ఈ అవార్డు అందుకున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే 'విక్ర‌మ్ వేదా' చిత్రం ఉత్త‌మ ద్వితీయ చిత్రం అవార్డును అందుకోవ‌డం విశేషం.

ఇదే అవార్డుల్లో ఉత్త‌మ చిత్రంగా 'ఒరు కిడారియ‌న్ క‌రుణై మ‌ను' నిలిచింది. ఈ చిత్రానికి సురేశ్ చంగ‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అలాగే లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన 'మానగరం' చిత్రం ప్రత్యేక జ్యూరీ అవార్డును గెలుచుకుంది. 'కురంగుబొమ్మై' చిత్రంలో నటించిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకున్నారు. నట శిక్షణ విద్యార్థుల కోసం నెలకొల్పిన అమ్మ అవార్డును 'డెయిసీ' చిత్రం గెలుచుకుంది. ఈ చిత్రానికి ఏ.నారాయణమూర్తి దర్వకత్వం వహించారు.
Amitabh Bachchan
vijay sethupathi
chennai

More Telugu News