5 నిమిషాల డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న కోసం రూ. 5 కోట్లు తీసుకుంటున్న ప్రియాంక చోప్రా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

5 నిమిషాల డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న కోసం రూ. 5 కోట్లు తీసుకుంటున్న ప్రియాంక చోప్రా

  • జీ సినీ అవార్డుల వేడుక‌ల్లో ప్రియాంక డ్యాన్స్‌
  • డిసెంబ‌ర్ 19న జ‌ర‌గ‌నున్న వేడుక‌
  • ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్న గ్లోబ‌ల్ స్టార్‌
హాలీవుడ్‌లో టీవీ షో, సినిమాల‌తో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రాను త‌మ అవార్డు వేడుక‌కు తీసుకురావ‌డానికి జీ నెట్‌వ‌ర్క్ బృందం తీవ్రంగా ప్ర‌య‌త్నించి సఫలమైంది. అందుకోసం ఆమె అడిగిన మొత్తం ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డింది. డిసెంబ‌ర్ 19న జ‌ర‌గ‌నున్న జీ సినీ అవార్డుల వేడుక‌లో ప్రియాంక చోప్రా డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌నుంది. ఈమె చేయ‌బోయే ఐదు నిమిషాల ప్ర‌ద‌ర్శ‌న కోసం జీ నెట్‌వ‌ర్క్ వారు రూ. 4-5 కోట్లు చెల్లించిన‌ట్లు తెలుస్తోంది.

దాదాపు రెండేళ్ల త‌ర్వాత భార‌త దేశంలో ప్రియాంక డ్యాన్స్ చేయ‌నుండ‌టంతో ఆ ప్ర‌ద‌ర్శ‌న అవార్డు వేడుక‌కే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని నిర్వాహ‌కులు చెబుతున్నారు. చివ‌రిసారిగా ఆమె ఇక్క‌డ 2016లో ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ అవార్డుల వేడుక‌లో డ్యాన్స్ వేసింది. ఇక, జీ సినీ అవార్డుల వేడుక‌లో ఆమె ఇటీవ‌ల బాగా ప్రాచుర్యం పొందిన బాలీవుడ్ పాట‌ల‌కు డ్యాన్స్ చేయ‌నుంద‌ని నిర్వాహ‌కులు వెల్ల‌డించారు.
priyanka chopra
zee cine awards
high remuneration

More Telugu News