తెలంగాణ మంత్రి చందూలాల్ కుమారుడి వాహనంపై రాళ్లదాడి!
- రసాభాసగా మారిన మేడారం ట్రస్ట్ బోర్డ్ ప్రమాణస్వీకార కార్యక్రమం
- లంబాడీలను అడ్డుకున్న ఆదివాసీలు
- ట్రస్ట్ బోర్డులో లంబాడీలకు స్థానం కల్పించడంపై ఆగ్రహం
మేడారం ట్రస్ట్ బోర్డులో లంబాడీలకు ఎలా స్థానం కల్పిస్తారని ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రహ్లాద్ ను కూడా అడ్డుకున్నారు. అంతేకాదు, ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఆదివాసీలకు మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం మేడారంలో ఉద్రిక్తభరిత వాతావరణం నెలకొంది. ప్రమాణస్వీకార కార్యక్రమం రసాభాసగా మారింది.