మరో ట్విస్ట్... విజయ్ సాయి భార్య వనితకు ఇద్దరు తండ్రులు, సహజీవనం చేస్తున్న తల్లి... పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు!
Add ap7am to your home Screen

మరో ట్విస్ట్... విజయ్ సాయి భార్య వనితకు ఇద్దరు తండ్రులు, సహజీవనం చేస్తున్న తల్లి... పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు!

  • స్కూల్ లో ఓ పేరు, పాస్ పోర్టులో మరోపేరు
  • తండ్రి పేర్లు కూడా మార్చి చూపిన వనిత
  • రఫీ అనే వ్యక్తితో వనిత తల్లి సహజీవనం
  • కేసును లోతుగా దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
నిన్న ఆత్మహత్య చేసుకున్న వర్థమాన నటుడు విజయ్ సాయి కేసును విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. విజయ్ సాయి భార్య పేరు వనిత కాదని, ఆమె అసలు పేరు వరలక్ష్మి అని పోలీసులు గుర్తించారు. స్కూల్ సర్టిఫికెట్, పాస్ పోర్టులలో వేర్వేరు పేర్లు ఉన్నాయని, తండ్రి పేరు కూడా వేర్వేరుగా ఉందని తెలుసుకున్నారు.

ఇక ఆమె తల్లి రఫీ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోందని కూడా గుర్తించిన పోలీసులు, విజయ్ కి, రఫీకి మధ్య ఏదైనా గొడవలు ఉన్నాయా? అన్న కోణంలోనూ దర్యాఫ్తు సాగిస్తున్నారు. తన సూసైడ్ వీడియోలో విజయ్ ఆరోపించిన లాయర్ శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. ఇన్ని పేర్లు, ముఖ్యంగా తండ్రి పేరు మారిన కారణాలను గురించి ప్రస్తుతం వనితను ప్రశ్నిస్తున్న పోలీసులు, ఆమె నుంచి మరిన్ని వివరాలు వస్తే, వారి కుటుంబ నేపథ్యం గురించి ఓ అవగాహన వస్తుందని, అది కేసుకు ముఖ్యమని పోలీసు వర్గాలు అంటున్నాయి.
Vijay Sai
Vanita
Sucide
Tollywood
varalakshmi

More Telugu News