నన్ను జైల్లో పెట్టించేందుకు ఒక టాప్ హీరో ప్రయత్నిస్తున్నాడు: కంగనా రనౌత్
- మరోసారి కంగనా సంచలన వ్యాఖ్యలు
- హృతిక్ రోషన్ ను ఉద్దేశించి కామెంట్
- కంగనా, హృతిక్ ల మధ్య కొనసాగుతున్న వివాదం
ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తన చెల్లెలు స్కూల్లో చదువుకునే రోజుల్లో తోటి విద్యార్థి నుంచి యాసిడ్ దాడిని ఎదుర్కొందని చెప్పింది. సినీ రంగంలో కొనసాగుతున్న తనను ఓ స్టార్ హీరో జైల్లో పెట్టించాలని చూస్తున్నాడంటూ ఆరోపించింది. ఇలాంటివన్నీ మన సమాజంలో అత్యంత సహజంగా జరిగిపోతున్నాయని తెలిపింది. కంగనా, హృతిక్ ల మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.