vemula veeresam: "ఆంధ్రా అధికారివి... నాకే ఎదురొస్తావా?" అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్లపురాణం... వైరల్ అవుతున్న ఆడియో!

  • ఓ అధికారిణికి పోస్టింగ్ ఇవ్వాలని సీఈఓకు బెదిరింపులు
  • పని చేయకుంటే అంతు చూస్తానన్న వీరేశం
  • తన పరిధిలోకి రాదని వారించిన సీఈఓ
  • అయినా వినని టీఆర్ఎస్ ఎమ్మెల్యే
గతంలో ఓ కాలేజీ యజమానిని చంపుతానని హెచ్చరించి, దాని ఆడియో బయటకు రావడంతో మార్ఫింగ్ చేశారని ఎదురు ఆరోపణలు చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత వేముల వీరేశం మరో వివాదంలో చిక్కాడు. ఆయనకు చెందిన ఆడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వీరేశం, నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓను బండబూతులు తిడుతున్నారు.

బ్యాంకు డీజీఎం లక్షమ్మ నిధుల దుర్వినియోగం కేసులో సస్పెండ్ కావడంతో, ఆమెకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని సీఈఓ మదన్ మోహన్ కు వీరేశం ఫోన్ చేశాడు. ఈ విషయం తన పరిధిలోది కాదని ఆయన చెబుతుంటే, "నా మాటకే ఎదురు చెప్తావా... ఆంధ్రా అధికారివి" అంటూ నోరు జారడంతో పాటు రాయడానికి వీల్లేని బూతులు తిట్టాడు. అడిగిన పని చేయకుంటే అంతు చూస్తానని హెచ్చరించాడు. ఈ వీడియో వైరల్ అవుతుండగా, వీరేశం వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

vemula veeresam
TRS MLA
Nakirikallu
Nalgonda

More Telugu News