చిరంజీవి .. బాలకృష్ణ సినిమాల కోసం నన్ను అనుకున్నారట: యమున
Add ap7am to your home Screen

చిరంజీవి .. బాలకృష్ణ సినిమాల కోసం నన్ను అనుకున్నారట: యమున

  • హిట్ చిత్రాలు చేసిన యమున 
  • ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ 
  • వరుస ఛాన్సుల వలన డేట్స్ కుదరలేదు 
  • అందుకే స్టార్ హీరోలతో చేయలేదు      
"తెలుగులో మీరు 'మౌన పోరాటం' .. 'సూరిగాడు' .. 'మామగారు' .. 'పుట్టింటి పట్టుచీర' వంటి హిట్స్ ఇచ్చారు. అయితే అప్పుడున్న స్టార్స్ చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ .. నాగార్జున .. వీళ్లెవరితోను చేయలేకపోయారు ఎందుకని?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో యమునకి ఎదురైంది.

అందుకామె స్పందిస్తూ .. " 'మౌన పోరాటం' తరువాత అదే బ్యానర్లో రెండు సినిమాలు కమిట్ కావడం జరిగింది. ఆ గ్యాప్ లో వేరే సినిమాలు వచ్చినా చేయలేకపోయాను. 'కొదమసింహం' సమయంలో చిరంజీవి కాంబినేషన్లో చేయడానికి గాను నన్ను అనుకున్నట్టుగా కైకాల సత్యనారాయణ గారు చెప్పారు. ఇప్పటిలా మొబైల్స్ లేకపోవడం వలన .. కాంటాక్ట్స్ లేకపోవడం వలన కొన్ని ఛాన్సులు మిస్సయ్యాను. అప్పట్లో బాలకృష్ణ సినిమా కోసమని నా గురించి ఉషా కిరణ్ మూవీస్ వారిని కూడా సంప్రదించారట. డేట్స్ కుదరకపోవడం .. ఆ స్టార్స్ తో చేయకపోవడం నా దురదృష్టమనే చెప్పాలి" అన్నారు.          
yamuna
chiranjeevi
balakrishna

More Telugu News