ఆసియా సెక్సీయస్ట్ మహిళల జాబితా: మొదటి స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్న ప్రియాంక
- మూడో స్థానానికి పరిమితమైన దీపికా పదుకునే
- రెండో స్థానంలో టీవీ నటి నియా శర్మ
- జాబితా ప్రకటించిన ఈస్టర్న్ ఐ వారపత్రిక
దీనిపై ప్రియాంక స్పందిస్తూ తన ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఈ అవార్డు వచ్చినందుకు తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొంది. ఈ జాబితాలో ఇప్పటికే ఐదు సార్లు ప్రియాంక మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో ఉన్న నియా శర్మ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానని తెలిపింది. ఇంకా ఈ జాబితాలో ఆలియా భట్, మహీరా ఖాన్, ద్రష్టి దామ్ని ఉన్నారు.