అణుదాడిని ఇలా తప్పించుకోండి.. చైనా ఆసక్తికర కథనం!
- ఉత్తరకొరియా సరిహద్దుల్లో ఉన్న జిలిన్ సిటీ
- 'జిలిన్ డైలీ'లో కామన్ సెన్స్ పేరిట ప్రత్యేక కథనం
- అణుదాడి నుంచి తప్పించుకునే మార్గాలు
సరస్సులు, నదులు అందుబాటులో లేని పక్షంలో చర్మం బయటకు కనబడకుండా దుస్తులు ధరించాలని సూచించింది. తద్వారా అణుదాడి ద్వారా సంభవించే దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చని ఆ కథనం తెలిపింది. ఈ మేరకు ఒక కార్టూన్ ను కూడా ప్రచురించింది. అంతేకాకుండా గతంలో జపాన్ లోని హిరోషిమా, నాగసాకిపై జరిగిన అణుదాడులు, వాటి ప్రభావం, రక్షణ చర్యలను కూడా ఆ పత్రిక సవివరంగా ప్రచురించింది.
కాగా, జిలిన్ సిటీ ఉత్తరకొరియాకు దగ్గరగా ఉంటుంది. ఆ పట్టణ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆ పత్రిక ఈ కథనం ప్రచురించింది. దీంతో చైనా కథనం వివిధ దేశాల్లో ఆసక్తి రేపుతోంది. ఉత్తరకొరియాకు సుదీర్ఘ కాలంగా మిత్రదేశంగా ఉన్న చైనా అకస్మాత్తుగా ఈ కథనం ఎందుకు ప్రచురించాల్సి వచ్చింది? అని వివిధ దేశాలు ఆలోచనలో పడ్డాయి.