రేపే సావిత్రి జయంతి .. సర్ప్రైజ్ చేయనున్న 'మహానటి' టీమ్
- తెలుగు .. తమిళ భాషల్లో 'మహానటి'
- ముగింపు దశకి చేరుకున్న షూటింగ్
- సినిమా నుంచి రేపు ఆసక్తికరమైన అప్డేట్
తెలుగు .. తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. సావిత్రిగా కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, జమున పాత్రను సమంత చేస్తోంది. ఇక సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనుండగా, ఎస్వీఆర్ పాత్రను మోహన్ బాబు పోషిస్తున్నారు. సావిత్రి అభిమానులంతా కూడా ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.