బాలయ్యతో బోయపాటి సినిమా ఖరారైనట్టే!
Add ap7am to your home Screen

బాలయ్యతో బోయపాటి సినిమా ఖరారైనట్టే!

  • చరణ్ సినిమా చేయనున్న బోయపాటి 
  • జనవరిలో మొదలు .. జూన్ లో పూర్తి 
  • తరువాత సినిమా బాలకృష్ణతో 
  • మార్చిలో విడుదల చేయాలనే ప్లాన్
ఎమోషన్ ను .. యాక్షన్ ను కలిపి అసలు సిసలైన హీరోయిజాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడిగా బోయపాటి శ్రీనుకి మంచి పేరుంది. ఇక మాస్ హీరోగా బాలకృష్ణకి గల క్రేజ్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. ' లెజండ్' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.

త్వరలో బాలకృష్ణ .. మహేశ్ బాబు కాంబినేషన్లో బోయపాటి ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ మల్టీ స్టారర్ సంగతేమోగానీ, బాలకృష్ణతో మాత్రం బోయపాటి ఒక సినిమాను తెరకెక్కించనున్నాడని అంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణకి కథ వినిపించడం .. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయట. చరణ్ సినిమాను జనవరిలో ప్రారంభించి జూన్ లో పూర్తి చేసే ఆలోచనలో బోయపాటి వున్నట్టుగా సమాచారం. ఆ తరువాత ఆయన అక్టోబర్ చివరివారంలో బాలకృష్ణతో సెట్స్ పైకి వెళ్లి, మార్చిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.  
balakrishna
boyapati

More Telugu News