ఇవాంకా పర్యటన షెడ్యూల్ మొత్తాన్ని గోప్యంగానే ఉంచారు!: కేసీఆర్
- ఇవాంకా టూర్ షెడ్యూల్ ఆద్యంతం రహస్యం
- వెస్టిన్ హోటల్ అన్నారు ట్రైడెంట్ కి మార్చారు
- ఎలాంటి పర్యటన లేదన్నారు గోల్కొండ కోట చూశారు
అలాగే ఆమె గోల్కొండ కోట సందర్శన చివరి క్షణం వరకూ గోప్యంగా ఉంచారని ఆయన తెలిపారు. అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ భద్రతా వ్యూహాలకు అనుగుణంగా తెలంగాణ పోలీసులు కూడా పనిచేశారని ఆయన అభినందించారు. జీఈఎస్ విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సిబ్బంది తీవ్రంగా శ్రమించారని ఆయన తెలిపారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేశాయని, దీంతో హైదరాబాదు పేరు ప్రతిష్ఠలు ప్రపంచవ్యాప్తమయ్యాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.