సావిత్రిగారిలా చేయడం ఓ సాహసమేనని అర్థమైంది: కీర్తి సురేశ్
- సావిత్రిలా నటించడం ఓ సవాలే
- ఆమెలా హావభావాలు పలికించడం సాధ్యం కాదు
- 100 రకాల కాస్ట్యూమ్స్ లో కనిపిస్తాను
'వయసును బట్టి సావిత్రి మారుతూ వచ్చింది .. నేను అలాగే కనిపించవలసి వస్తుంది. ఈ విషయంలోను ప్రేక్షకులను మెప్పించడం అంత తేలికైన విషయం కాదు' అని కీర్తి సురేశ్ అంది. ఈ సినిమా కోసం తాను దాదాపు 100 రకాల కాస్ట్యూమ్స్ తో కనిపించనుండటం ఓ విశేషమని చెప్పింది. ఈ సినిమా ప్రత్యేకతల్లో ఇది ఒకటిగా కనిపిస్తుందని అంది. ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో మోహన్ బాబు .. దుల్కర్ సల్మాన్ .. విజయ్ దేవరకొండ .. సమంత .. షాలిని పాండే నటిస్తోన్న సంగతి తెలిసిందే.