అబ్బే ఏమంత బాగాలేదు: ఇవాంకా గ్రీన్ డ్రస్ పై ఫారిన్ మీడియా ఎద్దేవా!
- ఆకుపచ్చని దుస్తుల్లో జీఈఎస్ లో పాల్గొన్న ఇవాంకా
- డ్రస్, షూస్ మ్యాచ్ కాలేదని కామెంట్లు
- ఉదయం పూట డ్రస్ బాగుందని కితాబు
ఉదయం హైదరాబాద్ లో దిగిన సమయంలో తెల్లటి ముత్యాలు కలిగిన నల్లని కోటు ధరించి, భారతీయత ఉట్టిపడేలా కనిపించిన ఆమె, సాయంత్రం ఏ మాత్రం హుందాగా లేని దుస్తులతో వచ్చారని, ఆకుపచ్చ రంగుతో సిల్క్ క్లాత్ బాగున్నా, పూలతో సహజత్వం పోయిందని మీడియా పేర్కొంది. ఇవాంకా అవగాహనా లేమితోనే దుస్తులను, చెప్పులను ఎంచుకున్నట్టు కనిపిస్తోందని, ఇక ఈ గౌన్ ఎక్కువకాలం గుర్తుండే అవకాశాలు లేవని పలు మీడియా సంస్థలు అభిప్రాయపడ్డాయి.