రాజకీయ పార్టీ పెట్టాలని నన్ను కొందరు కోరుతున్నారు: ప్రొ.కోదండరామ్ కీలక వ్యాఖ్య
- రాజ‌కీయ పార్టీ పెట్టాల‌ని నాపై ఒత్తిడి ఉంది
- ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు
- 30న హైద‌రాబాద్‌లో 'కొలువులకై కొట్లాట' స‌భ‌
- ఉద్యోగాల భ‌ర్తీకి వెంట‌నే క్యాలెండ‌ర్ విడుద‌ల చేయాలి
తెలంగాణ ఏర్పడి మూడున్నరేళ్లు గడుస్తోన్నప్పటికీ, ఇంకా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆందోళన చేస్తోన్న టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ ఈ రోజు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొందరు తనను రాజకీయ పార్టీ పెట్టాలని కోరుతున్నారని, పార్టీ పెట్టాలని తనపై ఒత్తిడి ఉందని కీలక వ్యాఖ్య చేశారు. ఈ అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఈ నెల 30న హైదరాబాద్లో 'కొలువులకై కొట్లాట' సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగాల భర్తీకి వెంటనే క్యాలెండర్ విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.