నేనెప్పుడైనా నిన్ను కొవ్వెక్కిన పొట్టోడు అన్నానా?: కిమ్ జాంగ్ ఉన్ పై ట్రంప్ ఫైర్
- ట్రంప్, కిమ్ మధ్య మాటల మంటలు
- 'ట్రంప్ వృద్ధుడు, ఆయన వల్ల ఏమవుతుంది?' అన్ని కిమ్ జాంగ్ ఉన్
- 'కిమ్ పొట్టిగా, లావుగా ఉన్నాడు అని అన్నానా? నా స్నేహితుడిని నేను అలా అనగలనా?' అన్న ట్రంప్
దీనికి ట్రంప్ దీటుగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేసిన ఆయన ‘నన్ను వృద్ధుడంటూ కిమ్ ఎందుకలా అవమానపరుస్తాడు? అసలు నేను ఎప్పుడన్నా కిమ్ పొట్టిగా, లావుగా ఉన్నాడు అని అన్నానా? అతనికి స్నేహితుడిగా వుండాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను కదా.. ఏదో ఒక రోజు అలా అవుతుంది కూడా..’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దానిని మీరు కూడా చదవండి