ట్రంప్ యుద్ధాన్ని అడుక్కుంటున్నారు: కిమ్ జాంగ్ ఉన్ ఎద్దేవా
- ట్రంప్ ఆసియా పర్యటన సందర్భంగా ప్రకటన విడుదల చేసిన కిమ్ జాంగ్ ఉన్
- అణ్వాయుధ తయారీ ఆపేది లేదన్న నియంత
- ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా శక్తులను కూడగడుతున్నారు
- కొరియన్ ద్వీపకల్పంలో ట్రంప్ యుద్ధాన్నికోరుకుంటున్నారు
ట్రంప్ ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా శక్తులను కూడగతున్నారని ఆయన మండిపడ్డారు. ట్రంప్ విధ్వంసకుడని మండిపడ్డారు. ట్రంప్ కొరియన్ ద్వీపకల్పంలో యుద్ధాన్ని కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తాజా ప్రకటనతో కిమ్ ను భయపెట్టి దారిలోకి తీసుకురావచ్చని భావించిన అమెరికా ఆశలు నీరుగారినట్టేనని భావించవచ్చు. పైగా ట్రంప్ ను రెచ్చగొడుతూ ఆయన యుద్ధాన్ని అడుక్కుంటున్నారని ఎద్దేవా చేయడం ద్వారా ఉద్రిక్తతను మరింత పెంచారు. అంతే కాకుండా అణ్వాయుధ తయారీ ఆపేది లేదని స్పష్టంగా ప్రకటించి దేనికైనా రె'ఢీ' అనడం ప్రాధాన్యత సంతరించుకుంది.