వాళ్లకు పట్టిన గతే కిమ్ జాంగ్ కు పడుతుంది: ట్రంప్ వార్నింగ్
- లిబియా, ఇరాక్ మాజీ అధ్యక్షులకు పట్టిన గతే కిమ్ కు పడుతుంది
- కిమ్ పాలనను ఆ దేశ ప్రజలు ఇష్టపడటం లేదు
- కిమ్ పిచ్చి చేష్టలను అమెరికా ఒంటరిగానే ఆపగలదు
కిమ్ పాలనను ఉత్తర కొరియా ప్రజలు ఇష్టపడటం లేదని ట్రంప్ అన్నారు. అమెరికాను లక్ష్యంగా చేసుకుని కిమ్ అణ్వాయుధాలను రూపొందిస్తున్నారని... కిమ్ కు ఒకటే చెబుతున్నానని... అదేంటంటే, కిమ్ పిచ్చి చేష్టలను అమెరికా ఒంటరిగానే ఆపగలదు అని తెలిపారు. చైనా, రష్యాలు కిమ్ పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. మరోవైపు, దక్షిణ కొరియా పర్యటనను ముగించుకున్న ట్రంప్... చైనాకు బయల్దేరారు.