బాలకృష్ణ సొంత బ్యానర్ .. ఆఫీస్ నిర్మాణంపై దృష్టి!
Add ap7am to your home Screen

బాలకృష్ణ సొంత బ్యానర్ .. ఆఫీస్ నిర్మాణంపై దృష్టి!

  • ఎన్టీఆర్ బయోపిక్ కి సన్నాహాలు 
  • సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకున్న బాలకృష్ణ 
  • ఇంటికి దగ్గరలో ఆఫీస్ ఉండాలనే ఆలోచన
  • ఆ దిశగా జరుగుతోన్న ప్రయత్నాలు    
మొదటి నుంచి కూడా బాలకృష్ణ తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో ఎంత మాత్రం గ్యాప్ రానీయలేదు. జయాపజయాల గురించి పెద్దగా పట్టించుకోకుండా చకచకా సినిమాలు చేస్తూ వెళుతుంటారు. ఈ కారణంగా ఆయన ఇంతకాలంగా సొంత బ్యానర్ ఆలోచన చేయలేదు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ ను మాత్రం తన సొంత బ్యానర్లో చేయాలనే ఆలోచనతో రంగంలోకి దిగారు.

 'బ్రహ్మతేజ' ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ సినిమా కోసం సొంతంగా ఆఫీస్ కూడా తీయాలనే విషయంపై ఆయన దృష్టి పెట్టారట. తన ఇంటికి దగ్గరలోనే ఆఫీస్ వుంటే బాగుంటుందనే ఉద్దేశంతో, అక్కడికి దగ్గరలోనే పక్కా వాస్తుతో ఆఫీస్ నిర్మాణం చేపట్టాలని చూస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన అందుకు సంబంధించిన పనుల్లోనే వున్నారని చెబుతున్నారు.     
Balakrishna

More Telugu News