డబ్బులివ్వలేదని వైద్యానికి నిరాకరించిన శంషాబాద్ 'ట్రైడెంట్' వైద్యులు!

వైద్యోనారాయణో హరీః అన్నారు పెద్దలు... కానీ హైదరాబాదులోని శంషాబాద్ లోని ట్రైడెంట్ ఆసుపత్రి వైద్యులు మాత్రం అందుకు విరుద్ధంగా మారారు. దాని వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదులోని కస్తూర్బా పాఠశాలలో చదువుకుంటున్న రేణుక అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను శంషాబాద్‌ లోని ట్రైడెంట్ హాస్పిటల్‌ కు తరలించారు.

అయితే బాలిక తండ్రి డబ్బులు చెల్లించలేదని వైద్యులు, సిబ్బంది ఆమెకు చికిత్స చేసేందుకు నిరాకరించారు. దీంతో బాలిక పరిస్థితి విషమించింది. దీంతో ఆమె తండ్రి బాలల హక్కుల సంఘానికి ట్రైడెంట్ ఆసుపత్రి, వైద్యులు, సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Hyderabad
renuka
sucide attempt
trident hospital

More Telugu News